అదొక చిన్న దీవి.. వింత దీవి.. ప్రపంచంలో ఏదీవికి లేని ప్రత్యేకత దీని సొంతం..

ఆ వింత దీవి పేరు ‘ఫీజంట్’. దీని విస్తీర్ణం 2.17 ఎకరాలు..

‘ఫీజంట్’ దీవి ప్రతీ ఆరు నెలలకు ఒక దేశం మారుతుంది..

ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల మధ్య ఉండే ఈ దీవి ఆరు నెలలు స్పెయిన్ అధీనంలో ఉంటే మరో ఆరు నెలలు ఫ్రాన్స్ అధీనంలో ఉంటుంది..

ఒక దీవి రెండు దేశాల అధీనంలో ఉండటం ప్రపంచంలో ఎక్కడా లేదు..

మనుషులే లేని ఈ దీవిపై ఆధిపత్యం కోసం స్పెయిన్ - ఫ్రాన్స్ దేశాల మధ్య హోరా హోరీ యుద్ధమే జరిగింది..!

‘ఫీజంట్’..దీవిపై ఆధిపత్యం కోసం స్పెయిన్ - ఫ్రాన్స్ దేశాల మధ్య 17వ శతాబ్దంలో 30 ఏళ్లు యుద్ధం జరిగింది..

ఆ ఒప్పందమే ఈ ‘ఫీజంట్’..దీవి ఫ్రాన్స్ అధీనంలో ఆరు నెలలు..స్పెయిన్ అధీనంలో ఆరు నెలలు ఉండేలా జరిగింది..

అలా ‘ఫీజంట్’..దీవి ఫిబ్రవరి 1 నుంచి జులై 31 వరకు స్పెయిన్ అధీనంలోను..ఆగస్టు 1 నుంచి జనవరి 31 వరకు ఫ్రాన్స్ అధీనంలోను ఉంటుంది..