వర్షాకాలంలో వేధించే మొటిమల సమస్య
చర్మసౌందర్యానికి సంబంధించి చాలా మందిని వేధించే సమస్య ముఖంపై మొటిమలు.
వర్షాకాలంలో మొటిమల సమస్య అధికంగా ఉంటుంది.
తేమ శాతం పెరగటంతో మొటిమలు, మచ్చలకు దారితీసే బాక్టీరియాకు అనుకూలంగా మారుతుంది.
జిగురు వంటి సెబమ్ అధికంగా ఉత్పత్తి అయి మొటిమలు అధికంగా వస్తాయి.
నూనెలతో తయారైన ఆహారాలను తినటం వల్ల చర్మం జిడ్డుగా మారి మొటిమలకు అవకాశం ఏర్పడుతుంది.
చర్మసౌందర్యానికి సంబంధించి చాలా మందిని వేధించే సమస్య ముఖంపై మొటిమలు.
వర్షాకాలంలో పాలు తాగటం వల్ల వాటి ప్రభావం హార్మోన్లపై పడి మొటిమలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
బచ్చలి కూర ఎక్కువగా తినడం వల్ల మొటిమల సమస్య వస్తుంది.
ఆహారాలలో కేకులు, చాక్లెట్, స్వీట్ డ్రింక్స్, ఐస్ క్రీం, శీతల పానీయాలు, వైట్ బ్రెడ్, బంగాళదుంపలు, వైట్ రైస్ వంటి వాటిని తినటం తగ్గించాలి.
సీజన్ల వారిగా చర్మ రక్షణ విషయంలో జాగ్రత్తలు పాటించటం అన్నది చాలా ముఖ్యం.