యుక్త వయసులో చాలా మందికి మొటిమల సమస్య మొదలవుతుంది.
అధిక కొవ్వు ఉండే ఆహారాలను తీసుకోవడం, చర్మంపై మృతకణాలు పేరుకుపోవడం, అదనపు నూనె ఉత్పత్తి, బాక్టీరియా వంటి కారణాల వల్ల సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.
గర్భం , ఋతుస్రావంతో సహా హార్మోన్లలో మార్పులు , ధూమపానం వంటివి మొటిమల సమస్యకు కారణమౌతాయి.
మొటిమల సమస్యను నిరోధించేందుకు కొన్ని చిట్కాలు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి.
పుదీనా, తులసి ఆకులు మెత్తగా నూరి మొటిమలు వచ్చిన ప్రాంతంలో అప్లై చేయాలి.
తులసి ఆకులు నూరి పెరుగులో కలిపి రాసినా ఫలితం ఉంటుంది.
అర కప్పు పచ్చి పాలు, వన్ టేబుల్ స్పూన్ నిమ్మ రసం వేసి ఐదు నిమిషాల పాటు ఉంచాలి. తరువాత చిటికెడు కుంకుమ పువ్వు, పావు టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసి.. ఆ మిశ్రమాన్ని దూది సాయంతో మొటిమలు ఉన్న చోట అప్లై చేయాలి.
టమాట పండ్ల రసం తీసి మొటిమల మీద రాసి ఓ గంట తర్వాత ముఖం చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే మొటిమలు తగ్గుతాయి.