టమాటాలు పండితే ఎర్రటి ఎరుపులో ఉంటాయి..పచ్చి టమాటాలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి..
కానీ ‘గులాబి’రంగు టమాటాను చూశారా..?
గులాబీ రంగు టమాట సాగుపై పరిశోధకులు దృష్టి పెట్టారు...
ప్రజారోగ్యంపై దృష్టి పెట్టిన తెలంగాణ శాస్త్రవేత్తల అద్భుత సృష్టి ‘గులాబీ టమాటా’..
దేశంలోనే తొలిసారి కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన వర్శిటీ పరిశోధకులు గులాబీ టమాటాలను పండించారు..
గులాబీ రంగు టమాటాల్లో
కంటి చూపును
పెంచే
విటమిన్ ఏ ఉంది...
క్యాన్సర్ ను నిరోధించే ‘ఆంథోసయానిన్’ గులాబీ టమాటాలో పుష్కలంగా ఉన్నాయి..
తక్కువ కాలంలోనే ఎక్కువ దిగుబడినిచ్చే గులాబీ టమాటాలను జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ప్రయోగాత్మకంగా సాగు చేశారు.
త్వరలోనే గులాబీ రంగు టమాటలు మార్కెట్ లోకి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు పరిశోధకులు..