జ్ఞాపకశక్తిని పెంచే ‘పిస్తా’పప్పుతో అనేక ప్రయోజనాలున్నాయి..
పిస్తాలో ఇతర డ్రై ఫ్రూట్స్ కంటే తక్కువ కొవ్వు, కేలరీలు ఉంటాయి..
పిస్తా శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది..
పిస్తా ఫైబర్, కార్బోహైడ్రేట్స్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు A, K, C, B-6, D, E, ప్రోటీన్, కాల్షియం, మాంగనీస్, ఫోలేట్ ఉంటాయి.
పిస్తాపప్పులో ఉండే ఖనిజాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మెదడుని మరింత చురుకుగా చేస్తుంది.
ప్రతిరోజూ కొన్ని పిస్తాపప్పులను తింటే..చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. గుండెను అన్ని ప్రమాదాల నుంచి కాపాడుతుంది.
క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది పిస్తా తినడం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి.
క్యాన్సర్ నిరోధకంలో సహాయకారిగా పరిగణించే పిస్తాపప్పులో యాంటీ కార్సినోజెనిక్ మూలకాలు కనిపిస్తాయి. ఇవి క్యాన్సర్ని నివారించేందుకు తోడ్పడుతాయి.
ఎముకల బలానికి విటమిన్ డి, కాల్షియం అవసరం. ఈ రెండు పిస్తాపప్పులో ఉంటాయి. ఎముకలకు సంబంధించిన అన్ని వ్యాధుల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
కంటికి మేలు చేసే A, E విటమిన్లు పిస్తాపప్పులో ఉంటాయి.