కుక్కలా కనిపించేందుకు జపాన్ కు చెందిన ఓ వ్యక్తి.. ఏకంగా రూ.11లక్షలు ఖర్చు చేయడం అందరిని విస్మయానికి గురి చేసింది.

14 అంగుళాల నడుము కోసం మహిళ ఎంతపని చేసిందో తెలుసా.. 

ఆమె పేరు పిక్సీ ఫాక్స్. స్వీడన్ కు చెందిన పిక్సీ ఫాక్స్ కు కార్టూన్లలో కనిపించే అమ్మాయిల లాంటి నడుము కావాలన్నది కోరిక. 

అంతే.. అలాంటి సన్నని నడుము కోసం ఏకంగా రూ.77లక్షలు ఖర్చు చేసింది. 

వెన్నెముకకు రెండువైపులా ఉండే 6 ఎముకలను తొలగించుకుంది. 

కనురెప్పలు, ముక్కు, వక్షోజాలకు కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. 2010లో తొలి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది.

ఇందుకోసం ఆమె సర్జరీలు చేయించుకుని.. అక్షరాల రూ.77 లక్షల 60వేలు ఖర్చుపెట్టింది.

హూ ఫ్రేమ్డ్ రోజర్ రాబిట్‌లోని జెస్సికా రాబిట్, స్లీపింగ్ బ్యూటీలోని అరోరా, కూల్ వరల్డ్‌లోని హోలలీ వుడ్ క్యారెక్టర్లలా కనిపించాలన్నదే తన కోరిక అని పిక్సీ చెప్పింది.

కుక్కలా కనిపించేందుకు జపాన్ కు చెందిన ఓ వ్యక్తి.. ఏకంగా రూ.11లక్షలు ఖర్చు చేయడం అందరిని విస్మయానికి గురి చేసింది.