వేస‌విలో రోజుమొత్తం కుండీలో ఉన్న మ‌ట్టి త‌డిగా ఉంచాలి.

సూర్యోద‌యానికి ముందు కానీ, సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత మొక్క‌ల‌కు నీళ్లు ప‌ట్టాలి.

ఎరువుల‌ను వేయ‌డానికీ ఇదే సూత్రాన్ని పాటించాలి.

అప్పుడే మొక్క‌లు ఆరోగ్యంగా ఉంటాయి.

మొక్క‌ల మొద‌ళ్ల ద‌గ్గ‌ర మ‌ల్చింగ్ చేయాలి.

చిన్న‌, పెద్ద మొక్క‌ల్ని క‌లిపి పెంచాలి.

పెద్ద మొక్క‌ల నీడ చిన్న‌వాటిపై ప‌డుతుంది. 

యూవీ కిర‌ణాలు నేరుగా చిన్న మొక్క‌ల‌పై ప‌డ‌వు.

మొక్క‌లు ఎండిపోయే స‌మ‌స్య కూడా దూర‌మ‌వుతుంది. 

ఎండిన కొమ్మ‌ల్ని, పురుగు ప‌ట్టిన ఆకుల్ని ఎప్ప‌టిక‌ప్పుడు తొల‌గిస్తూ ఉండాలి. 

లేక‌పోతే నీటిని ఎక్కువ‌గా పీల్చుకోవ‌డ‌మే కాక‌, చీడ పీడ‌లు మిగిలిన మొక్క‌ల‌కు అంటుకుంటుంది.