వర్షాకాలం ఇంటి లోపల కూడా చల్లదనం ఉంటుంది. ఈ తేమ ఎక్కువై ముక్క వాసన ఇబ్బంది పెడుతుంది.

కొన్ని రకాల ఇండోర్‌ మొక్కలతో ఈ సమస్య పోగొట్టుకోవచ్చంటున్నారు ఇంటీరియర్‌   నిపుణులు. మరి ఆ మొక్కలేంటో చూసేద్దాం.

తక్కువ వెలుతురుండే చోట పెంచే మొక్కల ఆర్కిడ్స్‌ ఒకటి. ఇది చుట్టు పక్కల వాతావరణాన్ని పొడిగా ఉంచడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడుతుంది.

లక్కీ బాంబూ..ఇండోర్‌కు చక్కటి సెలక్షన్. మట్టి అవసరం లేకుండా నీటిలోనే ఎదిగే ఈ మొక్క ఇంటిని స్నానాలగదిని పచ్చదనంతో నింపుతుంది. వాతావరణాన్ని పరిశుభ్రంగా మారుస్తుంది.

నీరు పెద్దగా అవసరం లేని మనీ ప్లాంట్‌నిని ఈ గదిలో చక్కగా పెంచుకుంటే ఆహ్లాదాన్నిస్తుంది. వాతావరణంలోని బెంజిన్‌, కార్బన్‌మోనాక్సైడ్‌ వంటివాటిని దూరం చేసి కాలుష్యరహితంగా మార్చేస్తుంది. దుర్వాసన లేకుండా చేస్తుంది.

స్పైడర్‌ప్లాంట్‌.. తక్కువ వెలుతురులోనూ సునాయసంగా ఎదిగే ఈ మొక్క చుట్టుపక్కల వాతావరణంలోని ఫార్మాల్‌డిహైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి టాక్సిన్స్‌ను పారదోలుతుంది.

పీస్‌లిల్లీ చూడటానికీ.. అందంగా ఉంటుంది. మెరిసే ఆకులు, తెల్ల పూలతో మనసును ఆహ్లాదంగా మార్చేయగలదు.

పీస్‌లిల్లీ ఆకులు పర్యావరణాన్ని కాపాడతాయి. వాతావరణంలోని అమ్మోనియా, ఫార్మాల్‌డిహైడ్‌, బెంజిన్‌ వంటి టాక్సిన్లను తొలగిస్తాయి. వాతావరణాన్ని పరిశుభ్రంగా మారుస్తాయి.

సూర్యరశ్మి ఎక్కువ అవసరం లేని మొక్కలు బోస్టన్‌ ఫెర్న్. వాతావరణాన్ని తాజాగా ఉంచుతాయి. ఆకులు గుబురుగా . వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుతాయి. బాత్ రూమ్ లో దుర్వాసలేకుండా చేస్తాయి..