ప్రపంచమంతా ప్లాస్టిక్ మయంగా మారిపోయింది.

అనేక రసాయనాలతో తయారైన ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీరు తాగటం వల్ల శరీర ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.

ప్లాస్టిక్ బాటిల్ వాటర్ హార్మోన్లపై ప్రభావితం చూపిస్తాయి. 

ఎండవేడికి గురైనప్పుడు నీటిలోకి కరిగిన ప్లాస్టిక్ పదార్ధాం చేరే అవకాశం ఉంటుంది. 

వాటర్ విషతుల్యంగా మారి రోగనిరోధక వ్యవస్ధను ప్రభావితం చేస్తాయి. 

వాటర్ బాటిల్స్ లో పాలీప్రొలైన్ అనే పాలిమర్ అవశేషాలు, అధిక మోతాదు కార్సినోజెన్స్, బ్రోమేట్స్ ఉంటాయని అనేక అధ్యయనాల్లో తేలింది.

రసాయనాలు నీటిలో కలవటం వల్ల వాటిని తాగిన వారిలో కాన్సర్ వంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది.

స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గిపోతుంది. లైంగిక పరమైన సమస్యలకు దారితీసే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్లాస్టిక్ బాటిల్స్ ద్వారా విడుదలయ్యే బెథాలేట్ అనే రసాయనం రక్తంలోకి ప్రవేశించి చివరకు కాలేయ క్యాన్సర్ రావటానికి కారణమౌతుంది. 

ప్లాస్టిక్ పర్యావరణానికి ముప్పు కలిగించటమే కాక మానవ ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది.