ఆరోగ్యకరమైన కూరగాయల్లో బ్రకోలి ముందువరసలో ఉంటుంది.ఈ గ్రీన్ వెజిటిబుల్ లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి..

బ్రకోలీలో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. క్యాలరీ కంటెంట్ తక్కువగా ఉంటుంది. విటమిన్స్ మినరల్స్ ఫైబర్స్ ఉంటాయి..

బ్రకోలిలోఉండే అధిక ఫైబర్ కొలెస్ట్రాల్ లెవల్స్ ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి ఇదొక మంచి ఆహారం ..

బ్రకోలీలో ఉండే అధిక ఫ్లెవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, లూటిన్, బీటా కెరోటిన్, జియాక్సిథిన్ వంటి యాకంటీఆక్సిడెంట్స్ వల్ల శరీరంలో ఫ్రీరాడికల్స్ తొలగించి  జీర్ణ వ్యవస్ధను మెరుగుపరుస్తుంది.

బ్రకోలీలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఎముకలను బలోపేతం చేయడానికి, ఎముకలు ఆరోగ్యంగా ఉంచటంలో  సహాయపడుతుంది.

శరీరంలో క్యాన్సర్ కు కారణం అయ్యే కెమికల్స్ ను శరీరం నుండి బయటకు నెట్టివేస్తుంది. క్యాన్సర్ దరి చేరకుండా కాపాడటంలో తోడ్పడుతుంది.

బ్రకోలీ బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. ఇందులో ఎక్కువ కార్బోమైడ్రేట్స్, ఫైబర్ కలిగి ఉన్నందున మధుమేహులకు మంచి ఆహారం

మెదడు పనితీరును మెరుగుపర్చటంలో బ్రకోలి బెస్ట్ గా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది.

బ్రకోలీలో విటమిన్ సి, విటమిన్ కె మరియు ఒమేగా ఫ్యాటీయాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. శరీరాన్ని అలర్జీలకు గురికాకుండా యాంటీ అలర్జిటిక్ లక్షణాలు కలిగి ఉండేలా చేస్తుంది. చర్మాన్ని కాంతి వంతంగా మారుస్తుంది.

బ్రకోలీని పచ్చి గా తినటం వల్ల ఎటువంటి గుండె జబ్బులు, కాన్సర్ మరియు దీర్ఘకాలిక వ్యాధులు మన దరి చేరకుండా రక్షణనిస్తుంది.

బ్రకోలి కాలేయంలో ట్రైగ్లిసెరైడ్ స్ధాయిలను తగ్గించి వాటితో ముడిపడి ఉండే నాన్ ఆల్కోహాలిక్ ప్యాటీ లివర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.