ఆడపడుచులు తమ సోదరులపై ప్రేమను కనబరుస్తూ.. ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండగ రాఖీ..
సోదరులు తమ తోబుట్టువులపై ఆప్యాయతను పంచేది పండగ రాఖీ..
శుక్ల పక్ష పౌర్ణమి తిథిని రాఖీ పూర్ణిమ అంటారు.
ఇది శ్రావణ మాసంలో వస్తుంది. అందుకే దీనిని శ్రావణ పూర్ణిమ అని కూడా అంటారు.
శ్రావణ పూర్ణిమ రోజున ఆయుష్మాన్ , సౌభాగ్య యోగాల అందమైన కలయిక ఏర్పడుతుంది.
ఇన్ని విశేషాలున్న రాఖీ పండుగ రోజున భారత్ కు పెద్దన్నలాంటి ప్రధాని నరేంద్ర మోదీకి చిన్నారులు రాఖీ కట్టారు.
ప్రధాని అధికారిక నివాసంలో పనిచేసే స్వీపర్స్, డ్రైవర్స్, తోటమాలి పిల్లలు మోదీకి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.
కల్మషం లేని చిన్నారుల చిరునవ్వుల మధ్య ప్రధాని కూడా హాయిగా నవ్వుతూ కనిపించారు.
నిరుపేదల ఆడబిడ్డలకు తానే పెద్దన్నను అనే సందేశాన్నిచ్చేలా మోడీ రక్షాబంధన్ పండగను జరుపుకున్నారు.