ఉత్తర‌ప్రదేశ్ లోని వారణాశిలో రూ.339 కోట్లతో  నిర్మించిన కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రధాన  మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించారు

వారణాశి చేరుకున్న ప్రధాని ముందుగా గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించారు

కాలభైరవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు

వారణాశి పురవీధులగుండా విశ్వనాధ ఆలయానికి చేరుకున్న ఆయనకు ప్రజలు పూలతో స్వాగతం పలికారు

అనంతరం ఋత్వికులు, వేదపండితుల మంత్రోఛ్చారణల మధ్య కాశీ విశ్వనాధుడికి  అభిషేకం చేసారు

అనంతరం కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణంలో పాల్గొన్న కార్మికులు,నిపుణులతో కలిసి భోజనం చేశారు