దేవుని పూజచేసే ముందు మీరు వెలిగించే ప్రమిద మీకు ఉన్న   కొన్ని సమస్యలను పరిష్కరిస్తుందట

మట్టి ప్రమిదలో ఆవునెయ్యి వేసి, తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే దుష్టశక్తుల నుంచి  విముక్తి లభిస్తుందని చెబుతారు

కంచు, ఇత్తడి ప్రమిదను శనగపప్పుపై పెట్టి చుట్టూ పసుపురంగు పూలతో అలంకరించి ఉత్తరాభిముఖంగా నువ్వులనూనెతో   దీపం వెలిగిస్తే ధనానికి స్ధిరత్వం ఉంటుంది

వెండి ప్రమిదను బియ్యంపై ఉంచి తెలుపు  రంగు పూలతో అలంకరించి, ఆవునెయ్యితో తూర్పు  ముఖంగా వెలిగిస్తే సంపదవృధ్ధి చెందుతుంది

బంగారు ప్రమిదను గోధుమలపై ఉంచి చుట్టూ ఎరుపు రంగు పూలు అలంకరించి ఆవునెయ్యితో  తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే ధనసమృధ్ధి కలిగి విశేష బుధ్ధి లభిస్తుంది

అమావాస్య రోజు రాత్రి ఆవు నెయ్యితో రావి  చెట్టు కింద దీపం పెడితే  పితృ దేవతలు సంతోషిస్తారుట

పిండి ప్రమిదలో దీపం వెలిగిస్తే అన్నిరకాలుగా లాభం చేకూరుతుందిట

ఆవ నూనెతో రావి చెట్టు కింద 41 రోజులు దీపం వెలిగిస్తే కోరిన కోరికలు  నెరవేరతాయట

నువ్వుల నూనెతో 41 రోజులు దీపం వెలిగిస్తే సమస్తరోగాలు నశించి ఆయురారోగ్యాలు సిధ్దిస్తాయి

గురువారం అరటి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపం వెలిగిస్తే అవివాహితులకు వివాహం అవుతుందిట