ఫైల్స్ సమస్యా? తీసుకునే ఆహారంలో!

జీవన శైలి, ఆహారపు అలవాట్లు వల్ల చాలా మందిలో అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. 

సుదీర్ఘమైన మలబద్ధకం, ఊబకాయం, గంటల తరబడి కూర్చోవడం లేదంటే నిలబడటం వల్ల ఈ పైల్స్ వ్యాధి వస్తుంది. 

పైల్స్ సమస్య ఉన్నవారిలో మల విసర్జన సాఫీగా జరుగదు. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, మంట పలు లక్షణాలు కనిపిస్తాయి. 

 జీవనశైలి, ఆహారం, నడవడికలో మార్పులు చేసుకుంటే కొంత వరకు సమస్య నుండి బయటపడవచ్చు.

ముందు ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండండి.

ఫ్రెంచ్ ఫ్రైలు, వేయించిన సమోసాలు,డీప్ ఫ్రైలు, ఫాస్ట్ ఫుడ్స్, నూనె, మసాలాలు, నూడిల్స్, బర్గర్స్, పిజ్జాలు వంటి ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి. 

 టీ, కాఫీలు తాగకూడదు. టీ, కాఫీలు తీసుకోవడం వల్ల పైల్స్ లక్షణాలు తీవ్రమవుతాయి. హెర్బల్ టీ తాగవచ్చు. 

 సిగరెట్ తాగడం , మందు తాగడం,గుట్కాలు, పాన్ పరాక్ లు నమలడం లాంటివి చేయకూడదు.

అంజీర పండు రాత్రంతా నీటిలో నానపెట్టి ఉదయం పరగడుపును తింటే మలబద్ధకం పోయి పైల్స్ వ్యాధి నయమైపోతుంది. 

దానిమ్మ తొక్కను వేసి బాగా ఉడికించి, వడగట్టి రోజుకు ఒకటి రెండు సార్లు తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

 అల్లం, నిమ్మరసం, తేనె కలిపిన జ్యూస్ ను ప్రతి రోజూ రెండు సార్లు సేవించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.