గడిచిన కొద్ది రోజులుగా రాష్ట్రంలో వానలు దంచి కొడుతున్నాయి

వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న  వర్షాలతో నివాసాల  పరిసరాల్లో వాన, మురుగు నీటి నిల్వలు పెరుగుతున్నాయి

ఇప్పటికే వాతావరణ మార్పులతో జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఫ్లూ జ్వరాలు విజృంభిస్తున్నాయి

వరద, మురుగు నీటి నిల్వల కారణంగా డయేరియా, జిగట విరేచనాలు, కామెర్లు, గ్యాస్ట్రోఎంటరైటిస్‌, మలేరియా,  డెంగీ, గున్యా, మెదడువాపు తదితర వ్యాధుల ముప్పు పొంచి ఉంది

హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆసుపత్రికి జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు లక్షణాలతో ఎక్కువ మంది వస్తున్నారు

వర్షాకాలంలో ప్రజలు సాధ్యమైనంత వరకూ వేడిచేసి చల్లార్చిన నీటినే తాగాలి

శరీరంపై గాయాలకు వరదనీరు తాకితే.. వెంటనే సబ్బుతో శుభ్రపర్చి, చికిత్స అందించాలి.చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవాలి

విద్యుత్‌ తీగలు, ఉపకరణాలను పక్కకు జరపాల్సి వచ్చినప్పుడు.. ముందుగా విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలి

వేడివేడి ఆహారం తీసుకోవాలి..నీరు రంగుమారితే తప్పకుండా కాచి చల్లార్చి తాగాలి. జలుబు, జ్వర, విరేచనాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి