ఇంగ్లాండు లో షుగరు వ్యాధి మీద ఒక పరిశోధన నిర్వహించారు. 40 రోజుల పాటు 23 దఫాలుగా ఈ పరిశోధన నిర్వహించారు. ఇందులో 12 లక్షల మంది డయాబెటిస్ ఉన్నవారు వాలంటీర్స్ గా సహకరించారు.

వారు వాడే మందుల డోసేజ్ లో ఏమీ మార్పులేదు.  కేవలం వారిని రోజులో కొంత సమయం నడిపించారు. ఒక్కోక్కరిని ఒక్కో సమయంలో నడిపించి అనంతరం వారిని పరీక్షించారు.

రోజుకు ఒక అర గంట, లేక 45 నిముషాలు వాకింగ్ చేస్తే చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు

ఏకబిగిన నడిచే వారికంటే, పొద్దున్న టిఫిన్ చేసిన తరువాత ఒక 5 నుంచి 10 నిముషాలూ, మధ్యాన్నం లంచ్ తరువాత 10 నిముషాలూ...

రాత్రి డిన్నర్ తరువాత ఒక 10 నిముషాలూ, అలా రోజులో మొత్తం మీద అరగంట వాకింగ్ చేయడం వల్ల రక్తంలో షుగర్ నిల్వలు బాగా తగ్గుతాయి అని తేలింది

తిన్న 5 నిముషాల లోపు లేచి, 5-10 నిముషాలు వాకింగ్ చేసిన వారి రక్తం లో షుగర్  నిల్వలు 11% నుంచి 44% శాతం వరకు తగ్గినట్లు వారు నిర్వహించిన Blood Test లలో తేలింది

కాబట్టి, Diabetics వారు, ఎంత సేపు వాకింగ్ చేశారు, ఎంత దూరం నడిచారు ? అనే దానికంటే,  ఎప్పుడు నడిచారు ? అనే దానికి ప్రాధాన్యత ఉన్నట్లు తేలింది

ఇందులో సగం మందిని, రోజుకు ఏకబిగిన 45 నిముషాలు నడవమన్నారు. మిగతా సగం మందిని 3 పూటలా, తిన్న వెంటనే నడవమన్నారు అంటే తిన్న 5 నిముషాల లోపే..లేచి..10 నిముషాలు నడవమన్నారు

40 రోజుల తరువాత 2 గ్రూపులకీ Blood Test లు చేసారు. దానిలో ఈ సత్ఫలితాలు వెల్లడి అయ్యాయి

ముఖ్యంగా, రాత్రి Dinner తరువాత 10 నిముషాలు నడిచిన వారి లో Sugar శాతం 22% తగ్గిందని వెల్లడి అయ్యింది

Sugar complaint ఉన్నవారు, స్త్రీలైనా, పురుషులైనా, మొత్తం మీద వారానికి 150 నిముషాలు యావరేజి న వాకింగ్ చెయ్యవలసిందే అని ఏకగ్రీవంగా వెల్లడి అయింది

తిన్న వెంటనే TV చూస్తూ కూర్చోకండి లేచి,.. మీ ఇంటి గదుల్లోన్నయినా సరే, గడియారం చూసుకుని 10 నిముషాలు నడవండి

40 రోజుల తరువాత  Blood Test చేయించుకోండి. షుగర్ వ్యాధి తగ్గుముఖం పడుతుంది