వేసవి కాలం వస్తోందంటే చాలు జనం భయపడిపోతారు.  శరీరానికి చాలా సవాళ్లు  తీసుకువస్తుంది.   వేసవి కాలంలో చర్మాన్ని చాలా పదిలంగా  చూసుకోవాల్సి ఉంటుంది.  ఈ కాలంలో వేడి అధికంగా ఉండడం వల్ల  చర్మ సౌందర్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. వేడిని తట్టుకోవడానికి తీసుకోవలసిన  కొన్ని జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం

సాధ్యమైనంత వరకూ ఎండ ఎక్కువగా  ఉండే సమయాల్లో బయటకు  వెళ్లకుండా ఉంటే మంచిది

ఇంట్లో వాతావరణం చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి

రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలి

ఎండలో ప్రయాణించే వారు గొడుగు, హెల్మెట్, గ్లౌజ్‌లు వాడాలి

పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది

ఎండలో బయటికి వెళ్లే సమయంలో కళ్లద్దాలు సన్‌ స్క్రీన్‌ లోషన్లు వాడాలి

వేసవిలో ముఖంపై ఎక్కువగా జిడ్డు పేరుకుంటుంది. కనుక చల్లటి నీటితో  కనీసం నాలుగైదు సార్లయినా కడుక్కోండి

తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు,  నీరు, పోషక విలువలు ఉండే  విధంగా చూసుకోవాలి

వేసవికాలంలో బయటకి వెళ్ళేటపుడు  మీతో వాటర్ బాటిల్‌ను  తీసుకెళ్ళండి  నీరు ఎక్కువ తాగండి

వేసవిలో కేశ సంరక్షణ కూడా చాలా ముఖ్యం. జుట్టును మరీ పొడవుగా ఉంచుకోకుండా వీలయినంత తక్కువగా ఉంచుకుంటే మంచిది