మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి. శరీరాన్ని నీళ్లతో తడుపుకోవాలి. వీలైతే రెండు, మూడుసార్లు స్నానం చేయాలి.

మజ్జగ, ఓఆర్ఎస్ లాంటివి తరచూ తీసుకోవాలి.

కాస్త తలనొప్పిగా అనిపించినా,తల తిరుగుతున్నట్లు ఉన్నా అప్రమత్తం కావాలి

వడదెబ్బ తగిలిందని తెలియడానికి తల తిరగడమే ప్రధాన సంకేతం. ఆ తర్వాత వాంతులు మొదలవుతాయి, తల బరువెక్కుతుంది

ఎవరిలోనైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నీడలోకి తీసుకెళ్లి మంచినీళ్లు ఇవ్వాలి. ఐస్ నీళ్లు, కూల్ డ్రింక్స్ వెంటనే ఇవ్వకూడదు

ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో వీలైనంత వరకు మధ్యాహ్నం ఎండలో తిరగకపోవడమే మంచిది 

ఒకవేళ తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగులు, టోపీలు లాంటివి వాడాలి.