వయోవృద్ధులు వేసవిలో
చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే సన్‌స్ర్కీన్ లోషన్ రాసుకోవడం మంచిది.ఈ క్రీంను ఎండకు బాడీ ఎక్స్‌పోజ్ అయ్యే ప్రాంతాల్లో రాసుకోవాలి.
పెద్దలు బయటకు వెళ్తే తప్పకుండా కళ్లకు డార్క్ గ్లాసెస్ పెట్టుకోవాలి.టోపీ పెట్టుకోవాలి..గొడుగు కూడా ఉంచుకోవాలి..
బయటకు వెళ్లే ముందు రెండు నుంచి నాలుగు గ్లాసుల నీటిని తాగాలి.
ఎండ నుంచి ఒక్కసారిగా ఏసీలోకి రాకూడదు. ఏసీని మెల్లిమెల్లిగా పెంచుకోవాలి.
సీజనల్ పండ్లను తరచు తీసుకోవడం మంచిది.
వృద్ధులు మసాలా వస్తువులను సాధ్యమైనంత వరకు వాడకపోవడం మంచిది.
ఉదయం వేళ వ్యాయామం చేయడం చాలా మంచిది.
ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడంతో పాటు నూనె వస్తువులను తగ్గించాలి.
మజ్జిగను తరచుగా.. తీసుకోవడం మంచిది.
ప్రయాణాలు చేసేటప్పుడు తప్పకుండా ORS లను తీసుకువెళ్లడం చాలా అవసరం.
ఆల్కహాల్, కార్బొనేటెడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండ డం మంచిది. వీటి వల్ల శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.