ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్స్ జోరు సాగుతోంది. అయితే కొన్ని సీక్వెల్స్ మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా, చాలా సీక్వెల్స్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. అలా వచ్చిన కొన్ని ఫ్లాప్ సీక్వెల్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

శంకర్‌దాదా జిందాబాద్.. మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్‌దాదా MBBS తొలిపార్ట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఈ సినిమా సీక్వెల్ మాత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.

సర్దార్ గబ్బర్‌సింగ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్ మూవీగా నిలిచిన గబ్బర్‌సింగ్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్, అనుకున్న స్థాయిలో ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది.

ఆర్య-2.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆర్య బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కానీ దానికి సీక్వెల్‌గా వచ్చిన ఆర్య-2 యావరేజ్ మూవీగా నిలిచింది.

మంత్ర-2.. హార్రర్ జోనర్ మూవీగా వచ్చిన ఛార్మీ మంత్ర తొలిభాగం ప్రేక్షకులను అలరించగా, సీక్వెల్ మూవీ మాత్రం ఘోరంగా పరాజయం పాలయ్యింది.

సత్య-2.. రామ్ గోపాల్ వర్మను బాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా చేసిన సత్య సినిమాకు సీక్వెల్‌గా సత్య-2 చిత్రాన్ని తెరకెక్కించి చేతులు కాల్చుకున్నాడు ఈ డైరెక్టర్.

కిక్-2.. ‘కిక్’ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న రవితేజ, మరోసారి కిక్ కోసం ప్రయత్నించి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాడు.

మనీ మనీ మోర్ మనీ.. గతంలో వచ్చిన మనీ, మనీ మనీ చిత్రాలు ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయినా, వాటికి సీక్వెల్‌గా వచ్చిన మనీ మనీ మోర్ మనీ ఫ్లాప్ మూవీగా నిలిచింది.

VIP-2.. తెలుగులో రఘువరన్ BTech చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన విఐపి-2 అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

మన్మధుడు-2.. అక్కినేని నాగార్జున కెరీర్‌లో మన్మధుడు చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. పూర్తి క్లాస్ మూవీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నా, దానికి సీక్వెల్ చిత్రం మాత్రం ఫ్లాప్‌గా మిగిలింది.