కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గతేడాది అక్టోబర్ 29న ఆకస్మిక మరణం చెందారు.
పునీత్ చివరి సినిమా ‘జేమ్స్’. జేమ్స్ సినిమాని మార్చి 17 పునీత్ జయంతి సందర్భంగా సినిమాని రిలీజ్ చేస్తున్నారు.
ఒక పాట, కొన్ని సీన్స్ మిగిలి ఉండగా పునీత్ మరణించారు. మిగిలిన ఆ సన్నివేశాల్ని గ్రాఫిక్స్ తో చిత్రీకరించారు.
'జేమ్స్' సినిమా కన్నడతో పాటు హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.
'జేమ్స్' సినిమా దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 4,000 థియేటర్లలో భారీగా విడుదలవుతోంది.
ఇందులో పునీత్ ఒక భద్రతాసంస్థలో మేనేజర్, సైన్యాధికారిగా రెండు పాత్రలు పోషించాడు. జేమ్స్ సినిమాలో ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటించగా, శ్రీకాంత్ విలన్ గా నటించారు.
ఈ సినిమాలోని ఫైట్స్ పునీత్ కంపోజ్ చేయడం విశేషం.
కర్ణాటక డిస్ట్రిబ్యూటర్స్, కన్నడ సినీ పరిశ్రమ ఇవాళ్టి నుంచి వారం రోజుల వరకు కర్ణాటకలో ఇంకో సినిమా రిలీజ్ అవ్వకూడదని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.
కర్ణాటకలో ఈ వీకెండ్ వరకు అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి.
కర్ణాటక థియేటర్స్ వద్ద పునీత్ 'జేమ్స్' కటౌట్స్ తో పాటు పాత సినిమాల కటౌట్స్ కూడా పెట్టి అభిమానులు హంగామా చేస్తున్నారు.
'జేమ్స్' సినిమాని 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.