ఇష్టపడి, ఎంతో ఖర్చు చేసి మరీ కొన్న దుస్తులపై మరకలు పడ్డాయా

దుస్తులపై పడ్డ మరకలను తొలగించుకునేందుకు చిట్కాలు

దుస్తులపై పడిన కాఫీ, టీ మరకలపై టాల్కమ్ పౌడర్ చల్లాలి.

లేదంటే చక్కెర కలిపిన నీటిలో మరక పడిన ప్రదేశం వరకు ముంచాలి. తర్వాత సబ్బుతో ఉతకాలి.

పండ్ల రసాలు, ఐస్ క్రీమ్ మరకలు పడితే నిమ్మరసంతో రుద్దడం వల్ల తొలగిపోతాయి

చొక్కా కాలర్, తలగడ కవర్లపై పడే మరకలను షాంపుతో ఉతకటం ద్వారా పోతాయి

దుస్తులపై పడిన రక్తం మరకను పోగొట్టాలంటే..

మరక పడిన చేట నీటితో తడిపి ఉప్పు చల్లి గట్టిగా రుద్దాలి. తర్వాత సబ్బుతో ఉతకాలి

ఇంక్ వంటి మరకలు పోవటానికి ఆ ప్రదేశంలో కాస్త ఆల్కహాల్ ని వేసి రుద్దాలి

మరకలపై పాల చుక్కలు వేసి, టూత్ బ్రష్‌తో గట్టిగా రుద్దడం ద్వారా ఇంక్ మరకలను పోగొట్టొచ్చు

గ్రీజ్, నూనె వంటి మరకలను మొక్కజొన్న పిండిని ఉపయోగించటం ద్వారా తొలగించుకోవచ్చు

వెనిగర్, వేడినీటిని సమభాగాల్లో కలిపి దానిలో మరకలంటిన దుస్తులను కాసేపు నానబెట్టాలి

ఆ తర్వాత బ్రష్‌తో రుద్ది ఉతికితే ఎటువంటి మరకలైనా పోతాయి