ఈ ప్రపంచంలో.. ఎన్నో రకాల  చెట్లున్నాయి...

కొన్ని ఎత్తుగా పెరుగుతాయి..మరికొన్ని లావుగా పెరుగుతాయి..కానీ చెట్ల రంగుల్లో పెద్దగా తేడాలుండవు..

కానీ ఓ చెట్టు మాత్రం చాలా అందంగా... ఇంద్రధనస్సులా ఉంటుంది..!

ఈ చెట్టుని ‘యూకలిప్టస్ డెగ్లుప్టా’..రెయిన్‌బో యూకలిప్టస్ అని కూడా అంటారు..

అచ్చు పెయింటింగ్ వేసినట్లుగా ఉండే ఈ  ప్రత్యేక చెట్లు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, పాపువా న్యూ గినియాలో కనిపిస్తాయి..

వర్షారణ్యాలలో కనిపించే యూకలిప్టస్ జాతి ఇది ఒక్కటే...

OneEarth నివేదిక ప్రకారం.. ఈ చెట్టు వయస్సు పెరిగేకొద్దీ దాని రంగు మారుతుంది.

ఈ చెట్టు పెరిగి పెద్దదవుతున్న కొద్దీ దాని బెరడు తొలగిపోతుంది. బెరడు తొలగిపోయాక కొత్తగా, ప్రకాశవంతమైన రంగులు కనిపిస్తుంది..

రెయిన్‌బో యూకలిప్టస్ చెట్ల సగటు పొడవు 76 మీటర్లు. తక్కువ సంఖ్యలో ఈ చెట్టు హవాయి, కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడాలో కూడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ దాని పొడవు 30 నుండి 38 మీటర్ల వరకు ఉంటుంది.

ఈ చెట్టు వాణిజ్య స్థాయిలో చాలా విలువైనదిగా పరిగణించబడుతుంది. 

ఈ చెట్లతో కాగితం తయారు చేస్తారు. అయితే రంగురంగులుగా కనిపించినప్పటికీ పూర్తయిన కాగితంపై ప్రభావం చూపదు.పేపర్ తెల్లగానే కనిపిస్తుంది..

ఈ చెట్లు చాలా వేగంగా పెరుగుతాయి.