ఇంట్రోవర్ట్ పిల్లలకు చాలా చెప్పాలని ఉంటుంది. కానీ, చెప్పరు. అలాంటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖాముఖీగా బాగా మాట్లాడగలరు

ఇటువంటి వాళ్లు ఎప్పుడూ సైలెంట్ గా సిగ్గుపడుతూ ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు. కాకపోతే వాళ్లు బాగా వింటారు. ముఖాముఖీగా బాగా మాట్లాడగలరు కూడా.

మాట్లాడమని బలవంతపెట్టకండి

సిగ్గుపడే పిల్లలు పరిసరాలకు తగ్గట్లుగా కంఫర్ట్ గా ఉండటానికి అలవాటుపడతారు. వాళ్లని మాట్లాడమని బలవంతపెట్టకండి. లేదా ఇతరులతో కలిసిపోవాలని తోసేయకండి. వాళ్లకు ఒక సేఫ్ వాతావరణం కల్పించి ఓపెన్ అయ్యేలా చేయండి.

పట్టించుకోకుండా వదిలేసి

ఇలాంటి పిల్లలు సమయం దొరికినప్పుడు చాలా మాట్లాడతారు. వాటిని పట్టించుకోకుండా వదిలేసి వాళ్ల అటెన్షన్ మిస్ అయ్యేలా చేసుకోకండి.

ఇతరులతో పోల్చొద్దు

మీ పిల్లలను ఇతరులతో పోల్చి.. ఎక్కువ మాట్లాడట్లేదని ఫీల్ అవకండి. వాళ్లు చేసే పనులకు పొగుడ్తూ.. ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తామనే భావన కలిగించండి.

తప్పుగా జడ్జ్ చేయకండి

మీ పిల్లలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చేసే పనులకు గట్టిగా అరవడం, లేదా తప్పని చెప్పడం చేయొద్దు. అలా చేయడానికి కారణం తెలుసుకుని మార్చే ప్రయత్నం చేయండి.

సహనం కోల్పోవద్దు

మీరు సహనం కోల్పోయి.. వారిని అలా వదిలేయకండి. కేరింగ్ తీసుకుని ఓపెన్ అయ్యేలా ప్రయత్నించండి.

వాళ్లే దగ్గరవుతారు

సిగ్గుపడే పిల్లలు ఎప్పుడూ ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తారు. వారికి కాస్త సమయం ఇవ్వండి. అప్పుడు వాళ్లే దగ్గరవుతారు.