రాఖీని ఎప్పుడు తీసేయాలి?
రాఖీని ఎప్పుడు తీసేయాలనే దానిపై మన గ్రంథాల ప్రకారం నిర్ధిష్ట సమయం లేదు.
మహారాష్ట్ర సంస్కృతిలో రక్షాబంధన్ రోజు నుంచి 15 రోజుల పాటు రాఖీ ఉంచాలి.
15 రోజుల తర్వాత పోలా అనే పండుగ జరిపి పశువులను పూజిస్తారు.
ఆ రోజున రాఖీలు తీసి చెట్లకు కడతారు.
ఇక రాఖీ దానంతట అది ఊడితే,
నీటిలో వేయాలని లేదా చెట్టుకు కట్టాలని పండితులు చెబుతారు.
కానీ, కావాలని రాఖీని తెంచకూడదని పండితులు సూచిస్తున్నారు.