ఫార్ములా E వంటి గ్లోబల్ ఈవెంట్‌ను మొదటిసారిగా హైదరాబాద్‌లో ఈ ఫిబ్రవరి 11న నుంచి నిర్వహించబోతున్నారు.

ఈ రేసింగ్‌లో ఉపయోగించే కారులు అన్ని మహేంద్ర ఆటోమొబైల్స్‌కి సంబంధించినవే.

దీంతో ఫిబ్రవరి 9న మహీంద్రా రేసింగ్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ ఈవెంట్‌కి మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు.

ఈ కార్యక్రంలో రామ్‌చరణ్ మాట్లాడుతూ..  ఫార్ములా E వంటి గ్లోబల్ ఈవెంట్‌లను హైదరాబాద్‌కి తీసుకువచ్చినందుకు మహీంద్రా టీం అండ్ తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించాడు.

ఇక ఈ ఈవెంట్‌లో చరణ్, ఆనంద్ మహేంద్రతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.