రామ్‌చరణ్ సతీమణి ఉపాసన..

జూన్ 20న పండంటి ఆడ‌బిడ్డ‌కి జన్మనించిన విషయం తెలిసిందే.

ఉపాసన అండ్ పాప హెల్త్‌గా ఉండడంతో..

హాస్పిటల్ నుంచి డాక్టర్స్ డిశ్చార్జ్ చేశారు.

ఇక తండ్రైన తరువాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చిన చరణ్..

డాక్టర్స్‌కి, శ్రేయోభిలాషులకు, ఫ్యాన్స్‌కి కృతజ్ఞతలు తెలియజేశాడు.

పాప పేరుని బారసాల రోజు తానే అనౌన్స్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రతి తండ్రి లాగానే పుట్టిన బిడ్డని చేతులోకి తీసుకున్నప్పుడు ఎమోషనల్ అయ్యినట్లు వెల్లడించాడు. 

అలాగే పాపకి కచ్చితంగా తన పోలికలే వస్తాయి అంటూ విలేకరి ప్రశ్నకు బదులిచ్చాడు.