కన్నడ బ్యూటీ రష్మిక మందన, ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా ఎలాంటి క్రేజ్‌ను సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. అయితే తన కెరీర్‌లో రష్మిక రిజెక్ట్ చేసిన కొన్ని సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

‘కిరిక్ పార్టీ’ హిందీ రీమేక్ చిత్రంలో రష్మికను హీరోయిన్‌గా తీసుకోవాలని చూస్తే, ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసింది.

‘జెర్సీ’ హిందీ రీమేక్‌లోనూ అమ్మడిని తొలుత సంప్రదిస్తే, ఆమె తల్లి పాత్రలో నటించనంటూ నో చెప్పేసింది.

‘ఆచార్య’ సినిమాలోనూ చరణ్ సరసన రష్మిక ఫస్ట్ చాయిస్ అయినా కూడా.. ఆమె ఈ సినిమాకు నో చెప్పింది.

విజయ్ ‘మాస్టర్’ సినిమాలో కూడా రష్మిక పేరునే ముందుగా అనుకున్నా, ఆమె నో చెప్పిందట.

విజయ్ ‘బీస్ట్’ మూవీలో కూడా రష్మికకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారట. అయితే పలు కారణాల వల్ల ఆమె ఈ సినిమాలో నటించలేదు.

‘అంటే సుందరానికీ..’ చిత్రంలోనూ నాని పక్కన రష్మికను తీసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయట.  కానీ ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట.

‘బంగార్రాజు’ సినిమాకు రష్మిక నో చెబితే ఆ ఛాన్స్  కృతిశెట్టికి లభించింది.

‘RC15’లో కూడా తొలుత రష్మికనే తీసుకోవాలని అనుకున్నారు. కానీ చివరకు కియారాను సెట్ చేశారు.

‘మహాసముద్రం’లో అదితి రావు హైదరి పోషించిన పాత్రలో తొలుత రష్మికను తీసుకోవాలని అనుకున్నా, అది కుదర్లేదు.