ఆరోగ్యానికి ప్రయోజనం కలిగించే ఆహారాల్లో కొబ్బరి ఒకటి.
కొబ్బరిలో విటమిన్ ఎ,బి,సి, థయామిన్, రైబోప్లెవిన్, నియాసిన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఇనుము పుష్కలంగా లభిస్తాయి.
పీచు అధికంగా ఉండి కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురగ్గా మారుస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలను తగ్గించి డయాబెటిస్ ను నియంత్రిస్తుంది.
శరీరానికి హాని చేసే చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపి గుండెకు ఎంతో మేలు చేస్తుంది.
నిద్ర పోవడానికి అర గంట ముందు స్పూన్ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం యవ్వనంగా కాంతి వంతంగా మారుతుంది.
నీరసం, అలసట వంటి సమస్యలు కొబ్బరి తినటం ద్వారా తొలగించుకోవచ్చు.
కొబ్బరిని ఆహారంలో తీసుకునే వారికి మలబద్ధకం, థైరాయిడ్ సమస్యలు దూరంగా ఉంటాయి.
క్రిములు, బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్, వైరస్ ల కారణంగా ఏర్పడే వ్యాధులను నయం చేయడానికి కొబ్బరి ఉపకరిస్తుంది.
ఐరన్ లోపం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే వారు ఆహారంలో కొబ్బరిని బాగం చేసుకోవటం మంచిది.