భారత్‌లో డిజిటల్ రూపాయి వచ్చేస్తోంది.

డిసెంబర్ 1 నుంచి సామాన్యుల చేతుల్లోకి డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి రానుంది. 

RBI పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన రిటైల్ డిజిటల్ రూపీలను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. 

RBI e-రూపీ డిజిటల్ టోకెన్ రూపంలో ఉంటుందని, చట్టబద్ధమైన  టెండర్‌ను సూచిస్తుంది.

ఫస్ట్ రిటైల్ కోసం పైలట్ ప్రాతిపదికన ప్రారంభించనుంది. 

ప్రస్తుతానికి రిటైల్ కస్టమర్లందరికీ డిజిటల్ రూపాయి అందుబాటులో ఉండదు.

పైలట్ క్లోజ్డ్ యూజర్ గ్రూప్ (CUG)లోని ఎంపిక చేసిన కొన్ని ప్రదేశాలలో మాత్రమే అందుబాటులోకి రానుంది. 

ఇందులో కస్టమర్‌లు, వ్యాపారులందరూ భాగస్వాములుగా ఉంటారు.

పేపర్ కరెన్సీ, నాణేలను జారీ చేసే డినామినేషన్స్‌లోనే డిజిటల్ రూపాయి కూడా జారీ చేయనుంది ఆర్బీఐ.