శరీరంలో ట్యాక్సిన్స్ తొలగించే ఆహారాలేమిటో తెలుసుకుందాం..దాని కంటే ముందు టాక్సిన్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం..

క్రిమిసంహారకాలు,విషపూరిత రసాయనాలు, పర్యావరణ కాలుష్యాలు, రసాయన వ్యర్థాలు,నీరు,ఆహారం, కాలుష్యం, పొగ, పొగాకు వినియోగం, ఆల్కహాల్, ఫార్మాస్యూటికల్ మందులు, విష రసాయనాలు, వంటి శరీరానికి హాని కలిగించేవాటిని టాక్సిన్స్ అంటారు.

షాంపూ, సబ్బులు, పెర్ ఫ్యూమ్, డియేడరెంట్ రూపంలో కూడా శరీరంలోకి విషతుల్యాలు చేరతాయి. వీటిని కాలేయం శుద్ధి చేసి, నీటిలో కరిగిపోయేలా మార్చేస్తుంది. దీంతో మూత్రం ద్వారా అవి బయటకు వెళ్లిపోతుంటాయి.

ఇది సరిగ్గా జరగకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే విషతుల్యాలు బయటకుపోవాలి. శరీరం నుంచి ఇటువంటి విషపదార్థాలని తొలగించడాన్ని డిటాక్స్‌ అంటారు.

కాలేయంలో శుద్ధి సరిగ్గా జరగకపోతే మొటిమలు, ఒత్తిడి, అధిక ఆకలి, మలబద్ధకం, అజీర్ణం, ఇన్ ఫ్లమేషన్ తదితర సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి కాలేయంలో టాక్సిన్ల క్లీనింగ్ సరిగ్గా జరిగే ఆహారాలు తీసుకోవాలి..అవేమిటో తెలుసుకుందాం..

వేప వెల్లుల్లి,

గ్రీన్ టీ, ద్రాక్ష, 

పుచ్చకాయ బొప్పాయి,

నిమ్మకాయ, అవకాడో

బ్రొకోలీ, క్యారట్లు,

అరటి పండ్లు,  బీట్ రూట్

ఓట్ మీల్

అంజీరా పండ్లు