ఏడేళ్ల క్రితం అదృశ్యమైన భారీ రాకెట్ నుంచి చంద్రునికి పెను ముప్పు తప్పింది.

మూడు టన్నుల బరువైన రాకెట్ శకలం చంద్రునికి అత్యంత సమీపంగా దూసుకెళ్లింది. 

రాకెట్ శకలం గంటకు 9,300 కిలోమీటర్ల వేగంతో చంద్రుని ఉపరితలానికి తాకుతూ దూసుకెళ్లింది. 

రాకెట్ శకలం వేగానికి చంద్రునిపై వందల కిలోమీటర్ల వరకు దట్టమైన ధూళి పైకి ఎగిసింది.

66 అడుగుల వరకు లోతైన బిలం ఏర్పడి ఉండొచ్చునని సైంటిస్టులు భావిస్తున్నారు.

రాకెట్ శకలం వెళ్లిన చంద్రుని చుట్టూ 3 టన్నుల వ్యర్థాలు పేరుకుపోయినట్టు గుర్తించారు.

రాబోయే కొన్నివారాల్లో పూర్తి వివరాలను తెలుసుకుంటామని సైంటిస్టులు చెబుతున్నారు.

రాకెట్ శకలం మార్చి 2015లో మొదటిసారిగా భూమికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో కనిపించింది.

సాధారణంగా రాకెట్ మిగిలిపోయిన శకలాలను ‘స్పేస్ జంక్’ అని పిలుస్తారు.

భూమికి తిరిగి వచ్చేందుకు తగినంత ఇంధనం లేని ఉపగ్రహాలు ఇలా అంతరిక్షంలో తిరుగుతుంటాయి.