ఎందరో మహనీయుల కృషి, త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం పొందిన భారతదేశానికి రాజ్యాంగ రచనలో ఎంతోమంది మేధావుల కృషి ఉంది. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ నాయకత్వంలో దాదాపు 60 రాజ్యాంగాలను తులన్మాతక అధ్యయనం చేసి, దాదాపు 3 ఏళ్లపాటు కృషిచేసి మన రాజ్యాంగాన్ని రూపొందించారు. 1949 నవంబర్‌ 26న రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించిన రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. ఇప్పుడు భారత్ 74వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న క్రమంలో భారత రాజ్యాంగ రచనలో మహిళ కృషి తెలుసుకుందాం..

భారత రాజ్యాంగ రచనలో  పాలు పంచుకున్న 15 మంది మహిళలు వీరే..

దుర్గాబాయి దేశ్‌ముఖ్‌

సరోజినీ నాయుడు

అమ్ము స్వామినాథన్‌

దాక్షాయణీ వేలాయుధన్‌

మాలతీ చౌదరి

కమలా చౌదరి

సుచేతా కృపలానీ

లీలా రాయ్‌

హంసా జీవరాజ్‌ మెహతా

విజయలక్ష్మీ పండిట్‌

రాజకుమారి అమృత్‌ కౌర్‌

పూర్ణిమా బెనర్జీ

బేగం ఐజాజ్‌ రసూల్‌

రేణుకా రే

అనీ మాస్కరీన్‌