నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పుడు అన్ని భాషల్లోనూ వరుస సినిమాలతో బిజీ అయిపోతుంది. ఇవాళ తన బర్త్‌డే సందర్భంగా మరిన్ని సినిమాలు అనౌన్స్ చేసింది. ప్రస్తుతం రష్మిక చేతిలో ఉన్న సినిమాలు..

బాలీవుడ్‌లో సిద్దార్థ్ మల్హోత్రా సరసన చేసిన 'మిషన్ మజ్ను' రిలీజ్‌కి రెడీగా ఉంది.

బాలీవుడ్‌లో అమితాబ్ కూతురిగా 'గుడ్‌బాయ్' సినిమా చేస్తుంది.

సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ సరసన 'పుష్ప 2' సినిమాలో నటించనుంది.

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్‌సల్మాన్ సరసన ఒక సినిమాలో నటించనుంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ సరసన ఒక సినిమాలో నటించనుంది.

సందీప్‌ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ సరసన 'యానిమల్‌'లో నటించబోతుంది.