వేసవిలో ఎండ దెబ్బకు తట్టుకోవాలంటే శరీరానికి చల్లదనాన్ని కలిగేవి తినాలి..

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే నానుడి సబ్జా గింజలకు సరిగ్గా   సరిపోతుంది. సబ్జాల్లో ఉండే ఔషధగుణాలు అన్నీ ఇన్నీ కావు..అవేంటో   తెలుసుకుందాం..

ఎండ దెబ్బ నుంచి తక్షణమే ఉపశమనం కలిగించి శరీరంలో జీవ క్రియలు   సక్రమంగా జరిగేందుకు ఇవి చాలా ఉపయోగపడతాయి.

మలబద్ధకం, కడుపు ఉబ్బరం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఉదర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా గ్యాస్, మలబద్ధకం సమస్యలను దూరం చేస్తుంది.

శరీరాన్ని వేసవి తాపానికి గురికాకుండా కాపాడేందుకు పండ్లు, మజ్జిగ, లస్సీ   వంటి పదార్థలతో పాటు కొన్ని గింజలను కూడా భాగం చేసుకోవాలి.

పండ్ల రసాలు తాగేటప్పుడు వాటిలో నానబెట్టిన సబ్జాలను కలుపుకుని తాగితే   ఆరోగ్యంతో పాటు వేసవి తాపానికి చెక్‌ పడుతుంది.

ఈ గింజల్లో ఉండే ఔషధగుణాలు డీటాక్సిఫికేషన్‌ నుంచి కాపాడుతాయి. వాహనాలు, గాలి, నీటి కాలుష్యం వల్ల చర్మం నల్లగా మారిపోతుంది. సబ్జా   తీసుకోవడం వల్లన ఈ సమస్యను అధిగమించవచ్చు.

శరీరంలో ఉండే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్స్‌, కొవ్వు   పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి.

మలబద్ధకాన్ని తగ్గించడంలో, పేగుల కదలికను ప్రోత్సాహించడంలో,   మూత్రపిండాల పనితీరు పెంచడంలో, రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గించడం,   నెమ్మదిగా బరువు తగ్గడానికి సహాయ పడుతుంది.

జుట్టు ఊడిపోకుండా ఒత్తుగా పెరగడానికి కూడా ఇది సహాయ పడుతుంది.కొబ్బరి నూనెలో పిండిచేసిన సబ్జా గింజలను కలిపి.. ఆ నూనెను అప్లై చేయడం ద్వారా ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.