సైయారా.. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీను షేక్ చేస్తున్న సినిమా ఇది.
సైయారా సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తుపాను సృష్టిస్తోంది.
ఇప్పటికే రూ.203 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం.
ఈ విజయం కారణంగా అందరి దృష్టి హీరోయిన్ అనీత్ పద్దాపై పడింది
పంజాబీ కుటుంబానికి చెందిన అనీత్ పద్దా, చిన్నప్పటి నుంచే నటనలో ఆసక్తి చూపింది.
ఇదివరకే క్యాడ్‌బరీ యాడ్ ద్వారా మంచి గుర్తింపు పొందింది.
‘బిగ్ గర్ల్స్ డోంట్ క్రై’ వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించింది.
సైయారాలో అల్జీమర్ వ్యాధి బాధితురాలుగా నటించిన తీరు ప్రేక్షకులను అలరించింది.
అనీత్ నటన చూసి పెద్ద స్టార్లు సైతం ఫిదా అయిపోయారు.