అల్లంతా లోతులో.. సముద్ర గర్భంలో  ఎన్నో వింతలకు నిలయం..

సముద్ర గర్భం..  ఎన్నో జీవజాతులకు  ఆలవాలం..

పడపు దీవులకు నిలయం సముద్రం

పడపు దీవుల మాటున  ఎన్నో వింత..విచిత్రమైన జీవులు జీవిస్తుంటాయి..దోబూచులాడుతుంటాయి..

ఇప్పటివరకు శాస్త్రవేత్తలు గుర్తించినవి కొన్నే.. ఇంకా ఎన్నో గుర్తించని జీవులున్నాయి..

సాగర గర్భంలో.. పగడపు దిబ్బల్లో దోబూచులాడుతు జీవిస్తున్న ఓ అందాల చేప ఇది..

గులాబీ రంగు పులుకుని పుట్టిందా? అన్నంత అందం ఈ చేప సొంతం..

చూడచక్కని ఈ మీనానికి ‘సిర్రిలాబ్రస్ ఫినిఫెన్మా’ అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు..

ఈ చేపను తొలిసారి 1990 లలో గుర్తించినా..అప్పుడు అది సిర్రిలాబ్రస్ రుబ్రుస్క్వామిస్ అనే జాతికి చెందిన వయసుమీరిన చేపగా భావించారు.

ఇటీవలి అధ్యయనంలో “సిర్రిలాబ్రస్ ఫినిఫెన్మా”  చేపలను ఒక ప్రత్యేక జాతిగా గుర్తించారు.

ప్రస్తుతం గుర్తించిన ‘‘సిర్రిలాబ్రస్ ఫినిఫెన్మా” చేప ఎంతో అందంగా ఉందని, ఇటువంటి చేపలను ఎన్నడూ చూడలేదంటున్నారు పరిశోధనలు