ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు..మరెన్నో రహస్యాలు ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

కొలంబియాలోని ఇపియల్స్ నగరంలో లాస్ లాజాస్  కేథడ్రల్

ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీని కింద నది ప్రవహిస్తుంది.

100 మీటర్ల ఎత్తులో  అడవుల మధ్యలో ఉన్నట్లు అనిపించే ఈ కేథడ్రల్ ఈక్వెడార్ సరిహద్దుకు ఆనుకుని ఉంటుంది.

కైలాస పర్వతం : శివుని నివాసంగా పేరొందిన ఈ కైలాస పర్వతాన్ని భూమికి కేంద్ర బిందువుగా భావిస్తారు.

టిబెట్‌ పీఠభూమి నుంచి 22,000 అడుగుల దూరంలో ఉండే ఈ పర్వతం సముద్ర మట్టానికి 6,656 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

ఈ కైలాస పర్వతంపై పరమశివుడు తన భార్య పార్వతి, అతని ప్రియమైన వాహనం నందితో కలిసి  నివసిస్తున్నారని హిందువులు నమ్ముతారు..

ఈ పర్వతాన్ని అధిరోహించటం ఎవ్వరికి సాధ్యం కాలేదు. ఎవ్వరి యత్నాలు ఫలించలేదు..ఇది ఒక రహస్యంగా మిగిలిపోయింది.

పాకిస్తాన్ మిస్టీరియస్ వ్యాలీ : పాకిస్తాన్ వాయువ్య, హిందూకుష్ పర్వత శ్రేణుల మధ్య కలాష్ అనే లోయ ఉంటుంది.

ఇక్కడ నివసిస్తున్న తెగకు కలాష్ అని పేరు. ఈ ప్రజలు అలెగ్జాండర్ వంశస్థులని చెబుతారు.

వారు ఎప్పటి నుంచి అక్కడ ఉంటున్నారనేది ఎవ్వరికి తెలియదు.

కలాష్ తెగ గురించి చాలా రహస్య విషయాలు ప్రచారంలో ఉన్నాయి.

ఇసుక సముద్రం : సౌదీ అరేబియా నుంచి యెమెన్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వరకు విస్తరించి ఉంది.

దీనిని ప్రపంచంలోనే అతి పెద్ద ఇసుక సముద్రం..ఇది అందమైన భయంకర ప్రదేశం అని అంటారు..