ఇవాళ మే 28న తెలుగు వారి మహనీయుడు, యుగపురుషుడు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన నాయకుడు, ఎందరో అభిమానులకు ఆరాధ్యదైవం అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి. ఈ సారి ఆయన శత జయంతి కూడా కావడంతో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన అభిమానులు, సెలబ్రెటీలు, కుటుంబ సభ్యులు, ఆయనతో సన్నిహితంగా ఉన్నవారు మరోసారి ఎన్టీఆర్ ని తలుచుకొని ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

ఆహార ప్రియుడు అయిన ఎన్టీఆర్ ఎక్కువగా ఏ ఫుడ్ తినేవారో, ఆయన రోజువారీ ఏం తినడానికి ఇష్టపడతారో తెలుసుకుందాం.

ఎన్టీఆర్ ఉదయాన్నే 6 గంటల కల్లా 10 నుంచి 15 ఇడ్లీలు, నాటు కోడికూర కలిపి బ్రేక్ ఫాస్ట్ కింద తీసుకునేవారట.

ఆ తర్వాత 10 గంటల సమయంలో మరో అయిదు ఇడ్లీలు తినేవారట.

ఎన్టీఆర్ కి యాపిల్ జ్యూస్ అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయాల్లో అప్పుడప్పుడు రోజుకి కనీసం ఒక లీటరు యాపిల్ జ్యూస్ తాగేవారు. ఎండాకాలంలో అయితే రెండు లీటర్లు వరకు తాగేవారట.

ఎండాకాలంలో మధ్యాహ్నం పూట గ్లూకోజ్ నీళ్లు తాగేవారు.

ఎండాకాలంలో రోజుకి 2 లీటర్ల బాదంపాలు తాగేవారు.

సాయంత్రం స్నాక్స్ లో బజ్జీలు కచ్చితంగా ఉండాల్సిందే. అలాగే డ్రైఫ్రూట్స్ కూడా సాయంత్రం పూట తినేవారు. పక్కన ఎవరన్నా ఉంటే వారికి కూడా  ఆ డ్రైఫ్రూట్స్ ఇచ్చేవారట.

మధ్యాహ్నం భోజనంలో రెండు కూరలు, పెరుగు, నెయ్యి, చారు, అప్పడం ఉండాల్సిందే.

నాటు కోడికూరని బాగా ఇష్టంగా తింటారట ఎన్టీఆర్.