సత్యం, సై, రెడీ, ఢీ, బొమ్మరిల్లు, ఆరెంజ్.. లాంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు వారికి బాగా దగ్గరైన హీరోయిన్ జెనీలియా. బాలీవుడ్ హీరో రితేష్ ని పెళ్లి చేసుకొని సినిమాలకి దూరమైంది జెనీలియా. మధ్య మధ్యలో కొన్ని సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చినా తాజాగా ఓ మరాఠీ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించబోతుంది. తెలుగులో కూడా మంచి పాత్రలు వస్తే ఇక్కడ కూడా సెకండ్ ఇన్నింగ్స్ కి రెడీ అంటుంది ఈ హాసిని.