బరువు పెరగడం సులువే... తగ్గించుకోవడమే చాలా కష్టం. ఇందుకోసం ఆహారంలో మార్పులులో చేసుకోవటంతోపాటు శారీరక శ్రమ చేయాలి..

తక్కువ కెలొరీలుండే కూరగాయలను రోజూ ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి కడుపు నిండినట్లుగా అనిపించి ఆహారం ఎక్కువగా తినకుండా చేస్తాయి..

అలాగని మాంసకృత్తులను మర్చిపోవద్దు.. మాంసం, పాలు, పప్పుదినుసులను  తీసుకోవాలి.

చిరుతిళ్ల పేరుతో కనిపించిన వాటినల్లా తినేయొద్దు. నూనెలో వేయించినవి, మసాలాలను తగ్గించి తాజాపండ్లు తినాలి.

వారంలో కనీసం మూడుసార్లు బరువులెత్తే వ్యాయామాలను చేయాలి. చిన్న వాటితో మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటుండాలి..

తాజా పండ్ల రసాలను తాగాలి. ముఖ్యంగా విటమిన్ సి ఉండే పండ్ల రసాలు తాగాలి.

రోజూ 8,000 అడుగులు వేయాలి. నడక వల్ల శరీరం మొత్తం కదులుతుంది...

ముఖ్యంగా తరచు నీరు తాగుతుండాలి..రోజుకు కనీసం మూడు లీటర్ల నీరు తాగాలి..