పూర్వం నుంచి ఈనాటికీ ఏడు వారాల నగలకు ఎంతో ప్రత్యేకత ఉంది..
ఏడు వారాల నగలు అంటే..రత్నాలతో కూడిన బంగారు నగలు ధరించటం..ఆదివారం నుంచి శనివారం వరకు ధరించే నగలనే ఏడువారాల నగలు అంటారు.
ఆదివారం : సూర్యుడిని ప్రసన్నం చేసుకోవటానికి కెంపులు పొందిగిన కమ్మలు..హారాలు ధరిస్తారు..
సోమవారం : సోముడు అంటే చంద్రుడు. ముత్యాలతో చేసిన నగలు ధరిస్తారు.హారాలు..గాజులు, కమ్మలు వంటివి ధరిస్తే చంద్రుడు అనుగ్రహం లభిస్తుంది.
మంగళవారం : పగడాలు పొదిగిన ఉంగరాలు. దండలు దరిస్తే మంచిది..
బుధవారం : పచ్చల పతకాలు. గాజులు, చెవి కమ్మలు ధరిస్తే బుధుడు అనుగ్రహం కలుగుతుంది.
గురువారం : కనక పుష్యరాగంతో తయారు చేసిన బంగారు కమ్మలు, ఉంగరాలు, హారాలు ధరిస్తే బృహస్పతి గ్రహం ప్రసన్నం కలుగుతుంది.
శుక్రవారం : వజ్రాల హారాలు, ముక్కుపుడక, గాజులు ధరిస్తే శుక్ర గ్రహం అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.
శనివారం : నీలమణి అంటే నీలాలతో చేసిన నగలు ధరిస్తే శని గ్రహం ప్రభావం మనపై పడకుండా ఉంటుంది.