అసలే చలికాలం.. మంచులో ఆడుకుంటున్న శ్రుతిహాసన్..

అసలే చలికాలం అని మనమంతా వణికిపోతుంటే శ్రుతిహాసన్ మాత్రం మంచు కురిసే ప్లేసెస్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంది.

స్టార్ హీరోల సరసన సినిమాలతో బిజీగా ఉన్న శృతి హాసన్ తాజాగా వాల్తేరు వీరయ్య షూటింగ్ కి చిత్ర యూనిట్ తో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ బోర్డర్ కి చెక్కేసింది.

షూటింగ్ లో గ్యాప్ దొరకడంతో అక్కడ చాలా ఎత్తులో ఉండి, మంచు కురిసే ఓ ప్రదేశానికి వెళ్ళింది శృతి. అక్కడ మంచులో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఇక్కడ అసలే చలిలో కష్టంగా ఉందంటే నువ్వేమో మంచులో ఎలా ఉంటున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.