ప్రభాస్ 'రాధేశ్యామ్' ప్రమోషన్స్ మరో లెవెల్ కి తీసుకెళ్లడానికి ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి కూడా ప్రమోషన్స్ లో భాగమవుతున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఆవిడ కొన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలలో ప్రభాస్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ప్రభాస్‌ కు పులస చేప కూర అంటే చాలా ఇష్టం.

ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నా వాళ్ళ పెద్దనాన్నను కుదిరినప్పుడల్లా కలుస్తూనే ఉంటాడు. 

ప్రభాస్‌ ఆయనను పెద్ద బాజీ అని, నన్ను కన్నమ్మ అని పిలుస్తాడు. నేను ప్రభాస్ ని బాబు అని పిలుస్తాను.

ప్రభాస్ కి చాలా ఫోన్‌ కాల్స్‌ వస్తాయి. అమ్మాయిల నుంచి మరీ ఎక్కువగా వస్తాయి. ప్రభాస్‌కు చాలా మొహమాటం. అమ్మాయిలతో మాట్లాడాలంటే చాలా సిగ్గు. ప్రభాస్ కి వచ్చే కాల్స్ అప్పుడప్పుడు నేనే లిఫ్ట్ చేసి మాట్లాడతాను.

ప్రభాస్ ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, లవ్ మ్యారేజ్ చేసుకున్నా మాకు ఏ ప్రాబ్లమ్ లేదు. పెళ్లి విషయం వాడి చేతుల్లోనే ఉంది. ప్రభాస్ కచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు.

ఇప్పటికే చాలా మంది అమ్మాయిలు ప్రభాస్ తో పెళ్లి కోసం మా దగ్గరికి వస్తు ఉంటారు.

ప్రభాస్ తో ఫోటో కావాలని చాలా మంది మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు.

ప్రభాస్ ఎంత సక్సెస్ సాధించినా గర్వం ఉండదు. అహంకారాన్ని తలకెక్కించుకోడు.

ఇలా ప్రభాస్ గురించి మనకి తెలియని చాలా విషయాలు ఈ ఇంటర్వ్యూలలో తెలిపింది శ్యామల దేవి.