మనలో చాలా మంది శాఖాహారం కంటే కూడా మాంసాహారంలోనే రోగనిరోధకశక్తి ఎక్కువని అనుకుంటారు. కానీ అది ఏమాత్రం వాస్తవం కాదు.

మనం అనారోగ్యాల బారిన పడటానికి ముఖ్య కారణం, మనం తీసుకునే ఆహారమే.

మాంసం ఎక్కువగా తింటే ఆరోగ్యంపై పడే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం.

మాంసాహారం ఎక్కువగా తింటే క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

కొవ్వు శాతం ఎక్కువగా ఉండే మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

మాంసం ఎక్కువగా తింటే, శరీరంలో మోతాదుకు మించిన ప్రోటీన్ చేరి పలు అరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

అధిక బరువు, కొవ్వు పేరుకుపోవడంతో పాటు మాంసాహారం వల్ల డయాబెటిస్ రిస్క్ కూడా ఉంది.

మాంసం ఎక్కువగా తింటే చెమట ఎక్కువగా పడుతుంది. ఈ ‘మీట్ స్వెట్స్’తో దుర్వాసన వస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారు మాంసాహారం మానేయడం ఉత్తమం.