రోజువారీ ఆహారంలో మనం తీసుకోవాల్సిన అతి ముఖ్యమైనది అల్పాహారం. ఏ పూట తిన్నా, తినకున్నా ప్రతిరోజూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కచ్చితంగా తినాలని  వైద్యులు సూచిస్తున్నారు

సన్నగా అవ్వాలనో, లేక బరువు పెరుగుతున్నారనే భయంతోనో, మరేదైనా కారణాలతో బ్రేక్‌ఫాస్ట్ చేయడం మానేస్తే ఆరోగ్యం విషయంలో అనర్థాలు తప్పవని హెచ్చరిస్తున్నారు

ఉదయం అల్పాహారం తినే వారితో పోల్చితే, మానేసే వారిలో గుండె సంబంధిత జబ్బులు, గుండెపోటు వచ్చే అవకాశాలు 27 శాతం ఎక్కువగా ఉంటాయని తేలింది

బ్రేక్‌ఫాస్ట్ మానేసే మహిళలలో టైప్2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని హార్వర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనంలో తేలింది

బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల మేగ్రేన్ తలనొప్పి సమస్య బారిన పడే ప్రమాదముంది. దీర్ఘకాలం దీని ప్రభావం ఉంటుంది

టీనేజీ పిల్లలు బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే వారి ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది

బ్రేక్‌ఫాస్ట్ రెగ్యులర్‌గా మానేస్తుంటే కొన్ని రోజుల తర్వాత రక్తహీనత సమస్య బారిన పడతాం

ఒకవేళ ఆల్కాహాల్ సేవించిన వారు ఉదయం అల్పాహారం తినకపోతే హ్యాంగోవర్ సమస్య అధికం అవుతుంది

బ్రేక్ ఫాస్ట్ మిస్ చేయడం వల్ల శరీరంలో శక్తి లేక తరచుగా అలసటకు గురవుతాం. అది మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది

అల్పాహారం తీసుకోవడం మానేస్తే జుట్టు త్వరగా ఊడిపోయి బట్టతల వస్తుంది. బ్రేక్‌ఫాస్ట్ వల్లే జట్టుకు కావలసిన అత్యధిక పోషకాలు అందడమే అందుకు ప్రధాన కారణం