గుండె జబ్బులు మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీయడమే కాదు, ఆయుష్షును కూడా తగ్గించేస్తాయి.

వీటికి కారణాలేమై ఉండొచ్చంటే.. 

శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే అంటే వ్యాయామం లాంటివి చేయకపోతే గుండెపోటు ప్రమాదం పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

ఒత్తిడి, డిప్రెషన్ కారణంగా కొంతమంది అతిగా తినేస్తుంటారు. దీని కారణంగా ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ మొదలైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఆందోళన ఎక్కువగా ఉంటే ఉదయాన్నే నిద్రలేచి యోగా, ధ్యానం వంటివి చేయండి. 

మగవారైతే చాలా ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు దగ్గరగా ఉన్న వారితో మాట్లాడండి. ఇలా చేయడం వల్ల మీకు ఒత్తిడి తగ్గుతుంది.

బయట దొరికే ఆహారాన్ని తక్కువగా తినండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి, అలసటను దూరం చేసుకోగలం. 

మనస్సును రిలాక్స్ చేయడానికి, సమతుల్య భోజనం తినడానికి నచ్చిన పనులను చేయండి. అలా చేస్తే లోపల నుంచి సంతోషంగా ఉండగల్గుతారు.

మనసులో రకరకాల అంతర్మథనాన్ని పక్కకుపెట్టి ఎక్కువగా కుటుంబంతో గడిపేందుకు ప్రయత్నించండి.

హఠాత్తుగా అనారోగ్యం పెరిగి ప్రాణాలు కోల్పోయే వారిలో గుండె జబ్బులే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.