మలబద్ధకం తగ్గించే సింపుల్ అండ్ నేచురల్ చిట్కాలు

తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల తలెత్తే ప్రధాన సమస్యల్లో మలబద్ధకం ఒకటి. 

మలబద్ధకంతో అనేక ఆరోగ్య సమస్యలు.

కడుపునొప్పి, పొట్ట ఉబ్బరం, గ్యాస్, ఆయాసం, దద్దుర్లు, వాంతులు, తేనుపులు.

కొన్ని చిట్కాలతో మలబద్ధకం నుంచి బయటపడొచ్చు.

మలబద్ధకం తగ్గించే చిట్కాలు

పరగడుపున అర లీటర్ గోరు వెచ్చటి నీళ్లు తాగాలి. 

రోజూ 2, 3 గ్లాసుల మజ్జిగ తాగితే మంచిది.

పీచు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి.

బెల్లం పొడి, నెయ్యిలను సమ భాగాలుగా తీసుకొని.. రెండింటినీ కలిపి మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత తినండి.

పుచ్చ, కర్భూజ, దోస లాంటి నీరు ఎక్కువగా ఉండే పండ్లను తినాలి. 

నువ్వుల పొడిలో ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థం, విటమిన్-E లాంటి పోషకాలుంటాయి. 

ఇవి ఆహారం జీర్ణం కావడానికి సహకరిస్తాయి. రాత్రి భోజనంలో నువ్వుల పొడిని భాగం చేసుకోవాలి.