మీరు వాడే ఫోన్ ఛార్జర్ బ్రాండెడేనా? ఇలా తెలుసుకోండి
మొబైల్ కొన్నప్పుడు వచ్చే ఛార్జర్ చెడిపోతేనో లేదా పొగొట్టుకుంటేనో మనం కొత్త ఛార్జర్ కొంటాం.
అలాంటి సందర్భంలో తక్కువ రేటుకే బ్రాండెడ్ ఛార్జర్స్ వస్తున్నాయని కొనుక్కుని మోసపోతుంటాం.
ఛార్జర్ నిజంగా బ్రాండెడో కాదో కనుక్కోవడానికి ప్రభుత్వమే ఓ యాప్‌ను ప్రొవైడ్ చేసింది.
దాని పేరే BIS CARE (బ్యూరో ఆఫ్ ఇండియన్స్ స్టాండర్డ్స్ కేర్).
ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని, దానిలో వెరిఫై R-నెంబర్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
మీరు కొనాలనుకునే ఛార్జర్ పై ఉన్న R-నెంబర్ ఎంటర్ చేయండి.
వెంటనే ఆ ఛార్జర్ ఎప్పుడు తయారు చేశారు?
ఎక్కడ తయారు చేశారు?
ఏ కంపెనీకి చెందినది?
ఎప్పటివరకు దాన్ని వాడొచ్చు? ఇలాంటి వివరాలన్నీ వస్తాయి.
దాన్ని బట్టి అది నిజంగా బ్రాండెడో కాదో సులభంగా తెలుసుకోవచ్చు.