వేసవిలో  డీహైడ్రేషన్ రాకుండా పానీయాలు వెరీ వెరీ బెస్ట్..

వేసవి పానీయాల్లో ఒకే ఒక్క గ్లాస్ చెరుకు రసం తాగితే వడదెబ్బ హుష్ కాకి అంటూ ఎగిరిపోతుంది..

చెరుకు రసంలో శరీరానికి కావాల్సిన మినరల్స్ ఉంటాయి. ఒక్క గ్లాస్ చెరుకు రసం తాగితే సుమారు 250 క్యాలరీల శక్తి లభిస్తుంది.

ఎండ వల్ల నీరసం వచ్చినా ఒక్క గ్లాస్ చెరుకు రసం తాగితే తక్షణం శక్తి వస్తుంది..చెరుకు రసం శరీరంలో నీటి స్దాయిని పెంచి ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది. .

చెరుకురసం శరీరంలో ఉన్న ప్రొటీన్స్ ను సమతూల్యం చేస్తుంది.  మూత్ర సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.

జలుబు, తుమ్ములతో బాధపడుతున్నవారు ఒక్క గ్లాసు చెరుకురసంతో ఉపశమనం పొందవచ్చు..

డీహైడ్రేషన్ వల్ల కిడ్నీలలో ఏర్పడే రాళ్ళను కరిగించడానికి చెరుకురసం ఎంతో సహాయపడుతుంది.

40 ఏళ్లు దాటిన స్త్రీలకు శరీరంలో క్యాల్షియం స్థాయిలు తగ్గుతాయి. అలాంటప్పుడు చెరుకురసం తాగితే క్యాల్షియం స్థాయి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

చెరుకు రసంలో అల్లం, నిమ్మరసం కలిపి తాగితే..శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు కూడా దరిచేరవు.

చెరుకు రసం శరీరంలో జరిగే జీవ క్రియలను సరైన క్రమంలో ఉంచడమే కాకుండా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.